చింతామణి చెరువు
చింతామణి చెరువు ధర్మపురి క్షేత్రంలోని చారిత్రక జలాశయం, గ్రామ మధ్యభాగంలో ఉంది. ఈ చెరువు మొదట నీటిపారుదల కోసం ఉపయోగించబడింది. తరువాత, పరిసర ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడింది. రాతితో నిర్మించిన తూములు భూగర్భ మార్గాల ద్వారా కోనేటితో అనుసంధానమై ఉండేవి. చెరువు నీటిని శివాలయంలో అభిషేకానికి ఉపయోగించారనే విశ్వాసం ఉంది. వరాహతీర్థంగా కూడా ఈ జలాశయానికి పేరు కలదు.
బ్రహ్మోత్సవ సమయంలో దీని ఒడ్డుకు వచ్చి పుట్ట బంగారం కొరకు మట్టి తీస్కొని పోతారు. అంతేకాకుండా, దసరా సమయంలో దీని దగ్గర ఊరేగింపు జరగగా నీటిలో ప్రతిబింబం చూడటం మరియు ఆ నీరు చల్లుకోవడం ఆనవాయితీ.