గోదావరి పుష్కరాలు · 26 జూన్ — 7 జులై 2027ప్రారంభానికి మిగిలిన సమయం 370రోజులు 19గంటలు 21నిమిమరింత చదవండి →

గద్దెలు: ఒక ప్రత్యేకమైన చారిత్రాత్మక వారసత్వం

ధర్మపురి క్షేత్రానికి ఉన్న మరొక ప్రత్యేకమైన మరియు చారిత్రాత్మకమైన అంశం దాని 'గ్రామ రక్షక' వ్యవస్థ. శతాబ్దాల క్రితం దాడుల నుండి ఊరిని రక్షించుకోవడానికి, ప్రజలు ఊరి చుట్టూరా చిన్న చిన్న ఆలయాలను నిర్మించారు. స్థానికంగా వీటిని 'గద్దెలు' అని పిలుస్తారు.

నరసింహస్వామి ఆలయ సమీపంలో ఉండే ప్రతి వీధి ప్రారంభంలో ఒక గద్దె ఉంటుంది. ఇందులో శివలింగం, నంది, పార్వతి, గణపతి, మరియు ఆంజనేయస్వామి కొలువై ఉంటారు. దీనినే 'శివ పంచాయతనం' అంటారు. ఆ కాలం నాటి ఆచారం ప్రకారం, ఆ వీధిలోని కుటుంబాలు ప్రతిరోజూ వీటికి పూజా పునస్కారాలు, నైవేద్యాలు సమర్పించడం ఒక బాధ్యతగా, సంప్రదాయంగా వస్తోంది.

ప్రసిద్ధ గద్దెలు

ఊరిలో భక్తిపూర్వకంగా నిర్వహించబడుతున్న కొన్ని ముఖ్యమైన గద్దెలు:

  • బొజ్జవారి గద్దె
  • బుగ్గారపు వారి గద్దె
  • ద్యావళ్ల వారి గద్దె
  • జగ్గన్నగారి గద్దె
  • కాసర్ల వారి గద్దె
  • కాశోజ్జల వారి గద్దె
  • నారంభట్ల వారి గద్దె
  • పాలెపు వారి గద్దె
  • పెద్దంభట్ల వారి గద్దె
  • పెండ్యాల వారి గద్దె
  • రావులపల్లి వారి గద్దె
  • వొజ్జల వారి గద్దె

ఈ గద్దెలు కేవలం కట్టడాలు మాత్రమే కాదు, ధర్మపురి ప్రజల శతాబ్దాల భక్తికి, తమ ఊరిని తాము రక్షించుకోవాలనే ఐక్యతకు నిదర్శనాలు.

రక్షక ఆలయాల మ్యాప్

గూగుల్ మ్యాప్స్‌లో గద్దెల మ్యాప్ తెరవండి