గోదావరి పుష్కరాలు · 26 జూన్ — 7 జులై 2027ప్రారంభానికి మిగిలిన సమయం 369రోజులు 15గంటలు 24నిమిమరింత చదవండి →

పండుగల క్యాలెండర్

ధర్మపురి క్షేత్రం ఏడాది పొడవునా వివిధ ఉత్సవాలతో మరియు ఆధ్యాత్మిక వేడుకలతో కళకళలాడుతుంది. ఇక్కడ అనేక ఉత్సవాలు జరుపుకోబడినప్పటికీ, వాటిలో అత్యంత ముఖ్యమైన కొన్ని పండుగల వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

తెలుగు మాసంఆంగ్ల మాసంపండుగలు / విశేషాలు
చైత్రంMarch – Aprilఉగాది - శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానములో పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి - రామాలయంలో వైభవంగా జరుపబడుతుంది, హనుమజ్జయంతి, సౌభాగ్యవ్రతం, అక్షయ తృతీయ, వసంత పంచమి
వైశాఖంApril – Mayశంకర జయంతి - రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుపబడుతుంది, పెద్ద ఏకాదశి పండుగ, నరసింహ నవరాత్రులు, నరసింహ జయంతి, అక్షయ తృతీయ
జ్యేష్ఠంMay – Juneనిర్జల ఏకాదశి, వటసావిత్రి నోము
ఆషాఢంJune – Julyపెద్ద ఏకాదశి పండుగ, గురుపూర్ణిమ
శ్రావణంJuly – Augustజంధ్యాల పౌర్ణమి, కృష్ణనవరాత్రులు, మంగళగౌరీ వ్రతం, నాగపంచమి
భాద్రపదంAugust – Septemberహరితాలిక వ్రతం, గణేశ చతుర్థి, ఋషి పంచమి, వామన జయంతి, అనంత చతుర్దశి, గణేశ నవరాత్రులు
ఆశ్వయుజంSeptember – Octoberదేవీనవరాత్రులు, విజయదశమి (స్వామి వారి విజయ యాత్ర), పితృపక్షాలు, కోజాగర పూర్ణిమ, దీపావళి నోము
కార్తీకంOctober – Novemberకార్తీక దీపోత్సవం - బ్రహ్మ పుష్కరిణి (కోనేరు)లో అద్భుతమైన దీపాలంకరణ, కార్తీక స్నానాలు
మార్గశిరంNovember – Decemberధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి, దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్తాత్రేయ జయంతి, గీతా జయంతి
పుష్యంDecember – Januaryగోదా కళ్యాణం, పుష్యాదివారాలు గోదావరి స్నానాలు, గోదావరిలో సంతర్పణలు
మాఘంJanuary – Februaryరామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు మరియు రథోత్సవం, సంక్రాంతి, వసంత పంచమి, సరస్వతీ పూజ
ఫాల్గుణంFebruary – Marchబ్రహ్మోత్సవాలు, ఏకాంతోత్సవాలు, త్యాగరాజ ఆరాధనోత్సవాలు, శివరాత్రి