బ్రహ్మోత్సవములు (జాతర) 2026
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణములో పవిత్ర గోదావరి నది తీరమున వెలసియున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మరియు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములు 27 ఫిబ్రవరి 2026 – 11 మార్చి 2026, 13 రోజులు అత్యంత వైభవముగా జరుగును. ఇట్టి ఉత్సవములలో పాల్గొని తరించగలరని కోరుచున్నాము.
కార్యక్రమ వివరములు
| తేదీ | వారం | కార్యక్రమం |
|---|---|---|
| 27 ఫిబ్రవరి 2026 | శుక్రవారం | ఉదయం 11:00 – అంకురార్పణ, కలశ స్థాపన, వరాహాతీర్థము, పుట్ట బంగారం |
| 28 ఫిబ్రవరి 2026 | శనివారం | సాయంత్రం 6:00 (గోధూళి ముహూర్తం) – శ్రీ స్వామి వారల కళ్యాణోత్సవములు |
| 1 మార్చి 2026 | ఆదివారం | రాత్రి 7:00 – శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్ల ఊరేగింపు సేవ |
| 2 మార్చి 2026 | సోమవారం | రాత్రి 7:00 – శ్రీ వేంకటేశ్వరస్వామి వార్ల ఊరేగింపు సేవ |
| 3 మార్చి 2026 | మంగళవారం | చంద్రగ్రహణము సందర్భముగా ఉ॥ 6-00 గం॥ల నుండి 7-00 గం॥ల వరకు డోలోత్సవము తదుపరి దేవాలయము మూసి వేయబడును. ఈ రోజున భక్తులకు దర్శనము ఉండదు. |
| 4 మార్చి 2026 | బుధవారం | మధ్యాహ్నం 3:00 – శ్రీ ఉగ్ర నరసింహ స్వామి వారి తెప్పోత్సవము, డోలోత్సవము |
| 5 మార్చి 2026 | గురువారం | మధ్యాహ్నం 3:00 – శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవము, డోలోత్సవము. 4:00 – శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దక్షిణ దిగ్యాత్ర |
| 6 మార్చి 2026 | శుక్రవారం | 4:00 – శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్తర దిగ్యాత్ర. రాత్రి 8:00 – భోగమండప ఉత్సవము, వేదసదస్సు |
| 7 మార్చి 2026 | శనివారం | 4:00 – శ్రీవేంకటేశ్వరస్వామి వారి దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలు. రాత్రి 8:00 – దోపోత్సవం (దోపుకథ) |
| 8 మార్చి 2026 | ఆదివారం | మధ్యాహ్నం 3:00 – మువ్వురుస్వాముల రథోత్సవము. రాత్రి 7:00 – చక్రతీర్థము, శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి (యోగ) వారి పుష్పయాగము |
| 9 మార్చి 2026 | సోమవారం | రాత్రి 7:00 – శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పుష్పయాగము. 9:00 – శ్రీ యోగ (పాత) నర్సింహస్వామి వారి ఏకాంతోత్సవము |
| 10 మార్చి 2026 | మంగళవారం | రాత్రి 7:00 – శ్రీ కొత్త (ఉగ్ర) నరసింహస్వామి వారి పుష్పయాగము. 9:00 – శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఏకాంతోత్సవము |
| 11 మార్చి 2026 | బుధవారం | రాత్రి 9:00 – శ్రీ కొత్త (ఉగ్ర) నర్సింహస్వామి వారి ఏకాంతోత్సవము |
నోట్
బ్రహ్మోత్సవములలో తేది. 27-2-2026 నుండి 11-3-2026 వరకు శ్రీ స్వామి వారి నిత్యకళ్యాణము, నిత్యనృసింహ హోమములు జరుపబడవు.